తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీలోని చెంగారెడ్డిపల్లిలో ఆదివారం జరిగిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' కార్యక్రమాన్ని తహసిల్దార్ విక్రమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల తీరు, రికార్డులను పరిశీలించి, ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో వీఆర్వో రమేష్, టీడీపీ మండల ఉపాధ్యక్షులు సూరి రాయల్, గ్రామ కమిటీ అధ్యక్షులు ధనంజయులు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.