AP: తిరుపతి నుంచి బీహార్‌లోని రక్సౌల్‌కు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17433/17434) ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, డిసిఎమ్ మోహన్ కృష్ణ కలిసి పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. గతంలో స్పెషల్ రైలుగా నడిచిన ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ దీనిని శాశ్వత ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చింది. ఈ రైలు తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ వంటి ముఖ్య స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి రక్సౌల్ జంక్షన్‌కు చేరుకుంటుంది.