ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ

AP: ప్రభుత్వం పరిపాలనా కారణాల రీత్యా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జీవీఎంసీ సూపరింటెండెంట్ బి.శంకర రావు సాలూరు మున్సిపల్ కమిషనర్‌గా, గుత్తి మున్సిపల్ కమిషనర్‌గా ఎన్.సురేంద్ర పూర్తిస్థాయిలో నియమితులయ్యారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన డి.రాంబాబును డిప్యుటేషన్ ప్రాతిపదికన సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఒక సంవత్సరం పాటు నియమించారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్

✕
✕