AP: పంచాయతీ ఎన్నికల్లో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఇద్దరు ఎన్నికల రిటర్నింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు మండలం ఎన్ఆర్ పేట ఆర్వో విజయ కుమారి (బొమ్మసముద్రం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు), తుమ్మింద ఆర్వో దూర్వాసులు (నరహరిపేట ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.