రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

AP: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం అమరావతికి రానున్నారు. రాష్ట్రంలో 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా పాల్గొననున్నారు. ఏపీలో రహదారుల అభివృద్ధికి ఇది కీలకం కానుంది.

సంబంధిత పోస్ట్