ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు సమీపంలో రామాలయం పునర్నిర్మాణం కోసం గొంతెనమ్మ గుడిని అర్ధరాత్రి కూల్చివేసిన వ్యవహారంలో స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణకు అంగీకరించింది. ప్రభుత్వ స్థలాలలో మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ ప్రయోజనాల కోసం నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని జయంతి ఉన్నమట్ట దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.