నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సామాజిక తనిఖీలపై సమావేశం నిర్వహించారు. ఈనెల 28 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు డీఆర్‌పీలు, ఆర్పీలు క్షేత్రస్థాయిలో ఆడిట్ చేస్తారని ఏవో సుదర్శన రావు వెల్లడించారు. సామాజిక తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు.