బొబ్బిలి మున్సిపాలిటీలో ఆస్తిపన్ను, కుళాయి పన్నులను ప్రజలు సమయానికి చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేశ్ కోరారు. సోమవారం పన్నుల వసూళ్ల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, దీని ద్వారానే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.