వచ్చే నెల మొదటి వారంలో అమలు కానున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కలెక్టర్ అంబేడ్కర్తో ఎమ్మెల్యే బేబీనాయన బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం అమలుకు సంబంధించి ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలన్నారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకం కింద డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క అన్నదాత నిరాశకు గురికారాదన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులపై చర్చించారు