బొబ్బిలి మండలంలోని కోమటిపల్లి, కలవరాయి గ్రామాల్లో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో రవికుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. లబ్ధిదారుల వద్దకు స్వయంగా వెళ్లి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్ అందజేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.