నేడు బొబ్బిలి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం

బొబ్బిలి పురపాలక సంఘం బడ్జెట్ సమావేశం శుక్రవారం చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై చర్చించనున్న నేపథ్యంలో సభ్యులందరూ సమావేశానికి సమయానికి హాజరై సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్