శనివారం బొబ్బిలిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా వాక్‌థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవ్యరెడ్డి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉండాలని, లేకుంటే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.