గురువారం బొబ్బిలి మండలంలోని మెట్టవలస సచివాలయం, రైతు సేవా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్‌లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సేవల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, సిబ్బంది హాజరు, ఈకేవైసీ ప్రక్రియ, ధాన్యం సేకరణ పరిస్థితులు, వైద్య సేవల నాణ్యతను పరిశీలించారు. ఏవైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.