బొబ్బిలి రైల్వే స్టేషన్ వద్ద 10 గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో రద్దైన సాలూరు–విశాఖపట్నం మెము రైలును వెంటనే పునరుద్ధరించాలని, బొబ్బిలి రైల్వే వ్యాగన్ లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్‌ను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాగన్ లోడింగ్ పాయింట్ తొలగింపుతో సుమారు 1000 మంది హమాలీలు ఉపాధి కోల్పోయారని, రైలు సేవలు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్టేషన్‌లో లిఫ్ట్, ర్యాంప్ బ్రిడ్జి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం అందజేశారు.