సిరిమానోత్సవం సజావుగా జరగాలంటే అందరి సహకారం అవసరం

పాతబొబ్బిలి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా జరగనున్న సిరిమానోత్సవం విజయవంతం కోసం బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సమయంలో శాంతి భద్రతలు పాటించాలని, మద్యం సేవించి సిరిమాను వద్దకు రావద్దని ఆయన సూచించారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు చోటుచేసుకుంటే కార్యక్రమం నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. సిరిమానోత్సవం విజయవంతం కావడానికి ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్