రంగరాయపురం సచివాలయాన్ని ఎంపీడీవో రవికుమార్ తనిఖీ

బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామ సచివాలయాన్ని స్థానిక ఎంపీడీవో రవికుమార్ బుధవారం తనిఖీ చేశారు. సచివాలయ పనితీరును సమీక్షించి, తాగునీటి సరఫరా, జలధార పథకం, పారిశుధ్య నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. 'స్వచ్ఛ రథం' వాహనాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవో కృష్ణమ్మ, పంచాయతీ కార్యదర్శి గణేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్