బొబ్బిలి మున్సిపల్ సమావేశం హాలులో శుక్రవారం చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అధ్యక్షతన సాధారణ సమావేశం జరగనుంది. గురువారం కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె కోరారు. అధికారులు పూర్తి సమగ్ర నివేదికతో రావాలని కమిషనర్ రామలక్ష్మి సూచించారు.