నేడు పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం

బొబ్బిలి డివిజన్ పరిధిలోని 33 కేవీ పారాది సబ్ స్టేషన్‌లో కొత్తగా 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు పనుల కారణంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం పారాది, మెట్టవలస నారాయప్పవలస, జి. సీతారాంపురం, కొత్తపెంట, గున్నతోతవలస గ్రామాల్లో ప్రభావం చూపనుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా అందించే ప్రయత్నం చేస్తామని, వినియోగదారులు సహకరించాలని బొబ్బిలి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారు.

సంబంధిత పోస్ట్