బొబ్బిలి మండలంలోని పెంట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో, రంగరాయపురం ఫీడర్‌కు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన పనులు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ ఈఈ బి. రఘు తెలిపారు. ఈ క్రమంలో, బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెల్లారపువలస, ఎం. బూర్జవలస గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.