పూల్ బాగ్ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం

బొబ్బిలి పట్టణంలోని పూల్ బాగ్ రోడ్డుకు శనివారం మరమ్మతులు ప్రారంభమయ్యాయి. గోతుల కారణంగా రోజూ ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారుల సమస్యను గుర్తించి, ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాల మేరకు మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులు చేపట్టారు. దీంతో స్థానికులు ఊరట చెందారు.

సంబంధిత పోస్ట్