బొబ్బిలి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను, వీఎల్‌టీ వసూళ్లు ఆశించినంత వేగంగా జరగడం లేదు. సుమారు రూ. 9. 5 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా శనివారం నాటికి కేవలం 50 శాతం మాత్రమే వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయి వసూళ్లు కష్టమని భావిస్తున్నారు. మొండి బకాయిలే ప్రధాన కారణమని చెబుతున్నారు. అపరాధ రుసుముపై 50 శాతం రాయితీ ఉండటంతో త్వరగా చెల్లించాలని సూచిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రాత్రి 8 గంటల వరకు వసూళ్లు చేస్తున్నారు.