శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం స్థానిక కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నాగరాజు, డీఎస్పీ రాఘవులతో కలిసి జాతర సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్