విజయనగరంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

విజయనగరం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రతపై వాహనదారులు, యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రయాణంలో సీటు బెల్టు ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకం, మద్యం సేవించి నడపడం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని, ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వాహనదారులు, స్థానిక డ్రైవర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్