డిసెంబర్ 12న ఎపి ఎన్జీవో గజపతినగరం యూనిట్ ఎన్నికలు

ఎపి ఎన్జీవో గజపతినగరం తాలూకా యూనిట్ ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల అధికారి జే. విక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 15 పదవులకు నామినేషన్లు ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎపి ఎన్జీవో భవనంలో స్వీకరించబడతాయి. ఎన్నికల ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, పరిశీలకుడిగా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తారు. సభ్యులు చురుగ్గా పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్