గజపతినగరం 2 సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గజపతినగరం 2 సచివాలయాన్ని ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు తీరును పరిశీలించి, విధులకు ఆలస్యంగా వచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని సిబ్బందికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సచివాలయ ప్రాంగణంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్