మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో డాక్టర్ గైర్హాజరు కావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఫోన్ చేసి, సంబంధిత డాక్టర్‌కు వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సేవలను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించాలని హెచ్చరించారు.