గ్రామ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్

విజయనగరం జిల్లా, మెంటాడ మండలం పరిధిలోని జక్కుల, బడేవలస, కొంపంగి, మీసాల పేట గ్రామాల్లోని సచివాలయాలను మండల స్పెషల్ ఆఫీసర్ బి.వి. చిట్టి రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హౌసింగ్ లక్ష్యాలను మార్చి 10లోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న యూనిఫైడ్ సర్వేతో పాటు హౌసింగ్ పనులపై కూడా దృష్టి సారించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో పంచాయతీ సెక్రటరీ ఆర్. సింహాచలం, వెల్ఫేర్ అసిస్టెంట్ మణికంఠ, మహిళా పోలీస్ సుశీల, పశు వైద్యులు నీలిమా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్