పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు వంటి 17 అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ సిఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.