పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో గల పెద్దంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు అటవీకి శాఖ అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ రహదారి వెంట ప్రయాణించే వాహన చోదకులు ఏనుగుల కదలికలను గమనిస్తూ వెళ్లాలన్నారు.