ఉగాది నాటికి 7, 187 గృహాల పూర్తి లక్ష్యం: కలెక్టర్ ఆదేశాలు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులకు గృహ నిర్మాణ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి చేయాలని, ప్రతి వారం 465 ఇళ్లు ఆర్ఎల్, ఆర్సీ స్థాయిల్లో పూర్తి చేయాలని సూచించారు. గత వారం 249 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. పనుల పురోగతిపై రోజు విడిచి రోజు సమీక్షలు నిర్వహించి, బీఎల్, ఎల్ఎల్ స్థాయిల్లో ఉన్న ఇళ్ల వివరాలు లబ్ధిదారుల వారీగా సిద్ధం చేయాలని, అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్