గిరిజన ప్రాంతాల్లో ఈ-పాస్ సిగ్నల్ సమస్యలపై డీఎస్ఓ పరిశీలన

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఈ-పాస్ (ePoS) సిగ్నల్ సమస్యలను జిల్లా సరఫరాల అధికారి బి. అశోక్ పరిశీలించారు. ఏపీపీ షాపులు, జీసీసీ డీఆర్ డిపోలలో ప్రజలకు పీడీఎస్ సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిగ్నల్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ పరిశీలనలో జీసీసీ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్