రేషన్ కేంద్రాల్లో జీసీసీ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు

పార్వతీపురం డివిజన్ పరిధిలోని పెద్దతోలుమండ, కుంచికోట, పెదతాడివలస, రావాడ, రామభద్రపురం గ్రామాల్లో జీసీసీ మేనేజర్ ఎం. సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ కె. రామారావు ఆదేశాల మేరకు రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి, కార్డుదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సబ్బులు తదితర నిత్యావసర వస్తువుల పంపిణీని తనిఖీ చేశారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్