కురుపాం: ఏవోబీలో రెడ్ అలెర్ట్!

మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా ఏవోబీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ పరిధిలో చెక్ పోస్టుల వద్ద సాయుధ పోలీసులను ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిసున్నారు. ఎల్విన్పేట సీఐ హరి పర్యవేక్షణలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్