పార్వతీపురం: విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధను కనబరచాలి

గిరిజన ప్రాంతంలో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని లేదంటే ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పార్వతీపురం మండలం డోకిశీల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో శుక్రవారం ఆయన విద్యార్థులను పరామర్శించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందని తేల్చిచెప్పారు.

సంబంధిత పోస్ట్