పార్వతీపురం: జిల్లాకు 12, 944 టన్నులు యూరియా సరఫరా

మన్యం జిల్లాకు 12, 944 టన్నులు యూరియా ఇప్పటి వరకు సరఫరా అయిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై చివరినాటికి జిల్లాలో దాదాపు 11, 327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 12, 944 టన్నులు జిల్లాకు సరఫరా అయ్యాయని ఆయన చెప్పారు. జిల్లాలో అవసరమైన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువులకోసం అనవసరపు ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్