జీసీసీ డిపోల పనితీరుపై సమీక్ష.. సకాలంలో సరుకుల పంపిణీకి ఆదేశం

పార్వతీపురం జీసీసీ డివిజన్ కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ జె. రామారావు అధ్యక్షతన డీఆర్ డిపోలు, ఆర్‌సీ గోదాముల సూపరింటెండెంట్లు, సేల్స్‌మెన్లతో సమీక్ష సమావేశం జరిగింది. నిత్యావసర, పీడీఎస్ సరుకులను సకాలంలో పంపిణీ చేసి రికార్డులు పూర్తి చేయాలని, గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తుల సేకరణ పెంచేందుకు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డిపోల నిర్వహణలో పారదర్శకత, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారశైలి పాటించాలని, సరుకుల పంపిణీపై ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్