పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ సదుపాయం ఈ నెల 16 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు se.census.gov.in పోర్టల్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి కుటుంబ వివరాలను తెలుగు సహా పలు భాషల్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తయ్యాక రిఫరెన్స్ ఐడి లభిస్తుంది. స్వయంగా నమోదు చేయని వారి వివరాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సేకరిస్తారు. దేశాభివృద్ధికి జనగణన కీలకమని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.