పార్వతీపురంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి, జనగణన 2027ను గడువుకు ముందే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 16–30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరగనుండగా, ముందస్తు శిక్షణ పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మే మొదటి వారానికే ప్రక్రియ పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.