అధిక లోడుతో ప్రయాణాలు ప్రమాదకరం

లారీలు, పికప్ వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం ప్రాణనష్టానికి దారితీస్తుందని ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హెచ్చరించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆయన పర్యటిస్తున్నప్పుడు, అధిక లోడుతో వెళ్తున్న లారీని ఆపి ప్రయాణికులను దించారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలు పాటించాలని, ప్రజలు సురక్షిత ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్