గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు సోమవారం భోగాపురం నుండి టిడిపి శ్రేణులతో కలిసి విజయనగరం అశోక్ బంగ్లాలో అశోక్ గజపతి రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈయన ఎంపిక జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.