నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

భోగాపురం మండలం ముక్కాం 11కేవీ రూరల్ ఫీడర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మత్తులు, నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ సురేశ్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయం ముక్కాం, కొండరాజుపాలెం, చోడిపిల్లిపేట, రామచంద్ర పేట, సబ్బన్నపిట, నందిగాం గ్రామాలకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్