సతివాడ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నెల్లిమర్ల మండలంలోని సతివాడ సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈఈ పి. త్రినాథరావు తెలిపారు. అలుగోలు రూరల్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, పాత కండక్టర్ల మార్పు వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో కలిగే అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్