జిల్లా సిబ్బందికోసం వైద్యశిబిరం ప్రారంభించిన కలెక్టర్

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్ది మాట్లాడుతూ, జిల్లా పరిపాలనా సిబ్బంది ఆరోగ్యం అత్యంత ముఖ్యం కావడంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా సేవలు అందించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీతో పాటు ఈసీజీ, ఎకో, ఎండోస్కోపీ వంటి పరీక్షలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్