హెల్మెట్ ధరించిన వారిని అభినందించిన జిల్లా పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేసి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రాణనష్టాన్ని ప్రజలకు వివరిస్తూ, రద్దీ ప్రాంతాల్లో హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి అంశాలపై ప్లెక్సీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని పోలీసులు అభినందించారు.

సంబంధిత పోస్ట్