ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు మొబిలైజేషన్ ప్రారంభం

మన్యం జిల్లా సాయుధ పోలీసుల కోసం 15 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగే ఈ శిక్షణలో విధుల్లో నైపుణ్యం, శారీరక దారుఢ్యం పెంపొందించడం, ఆయుధాల వినియోగం, డ్రిల్, బందోబస్తు విధులు, యోగా, మానసిక ఒత్తిడి నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ, సర్వీస్ రూల్స్, పోలీసు సంక్షేమం వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు.

సంబంధిత పోస్ట్