మెగా పీటీఎం నిర్వహణకు సన్నద్ధం

మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం)కు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడోసారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న పీటీఎంలో పాల్గొనున్నారు. దీంతో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా నాలుగో తేదీన రానున్న నేపథ్యంలో భామినితో పాటు జిల్లాలోని మిగతా పాఠశాలల్లోనూ పీటీఎం నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2024, డిసెంబరు 7న, 2025 జూలై 10న జిల్లాలో పీటీఎంలు జరిగాయి. తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశం చేపట్టేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్