రాజాం పట్టణంలో పశువులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుండటంపై సిఐ అశోక్ కుమార్ బుధవారం స్పందించారు. రోడ్డుపై వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువులను గోసాలకు తరలించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. రోడ్లపై పశువుల సంచారం వాహనదారులకు ప్రమాదకరమని, ప్రజల ప్రాణాలు హరిస్తే బాధ్యత యజమానులదే అని పేర్కొన్నారు.