రాజాం మండలం బుచ్చంపేటలో ఆదివారం రాత్రి ఓ స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగి పలువురు గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అడుగడుగునా పోలీసులు మొహరించి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొట్లాటకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టె వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.