రాజాం: ట్రాఫిక్ పోలీసులు వచ్చారు..

విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు రాజాం మండలంలో ఆరుగురు ట్రాఫిక్ పోలీసులు విధులను నిర్వహించనున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్రమబద్ధీకరించడం వీరి ప్రధాన విధి. ఓవర్ స్పీడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు విధించనున్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్