వంగర మండలం అరసాడ మండల పరిషత్ పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. టిడిపి నాయకుడు ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు గురువులను, తల్లిదండ్రులను గౌరవించి విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.